మోడీ నియామకంపై చర్చించాకే స్పందిస్తాం: నితీశ్
బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నరేంద్ర మోడీ నియామకంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆచితూచి స్పందించారు. దీనిపై పార్టీలో చర్చించాకే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. నరేంద్రమోడీ ప్రధానిగా ఆమోదనీయమైన వ్యక్తి కాదని నితీశ్ గతంలోనే విభేదించారు. ఒకవిధంగా మోడీ, నితీశ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేవరకూ పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్నికలకు ముందు మోడీని బీజేపీ కీలక స్థానంలో కూర్చోబెట్టడంతో జేడీయూ సంకటంలో పడింది. మోడీ ఎన్డీయే ప్రచార సారధిగా నియమితులు కాలేదని ఎన్డీయే కన్వీనర్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఇప్పటికే విషయాన్ని చిన్నది చేసే ప్రయత్నం చేశారు.